1 ఆ దినమున మీరీలాగందురు
–యెహోవా, నీవు నామీద కోపపడితివి
నీ కోపము చల్లారెను
నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి
యున్నావు.
2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు,
నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను
యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే
నా కీర్తనకాస్పదము
ఆయన నాకు రక్షణాధారమాయెను
3 కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు
లలోనుండి నీళ్లు చేదుకొందురు
ఆ దినమున మీరీలాగందురు
4 –యెహోవాను స్తుతించుడి ఆయన నామమును
ప్రకటించుడి
జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి
ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు
కొనుడి.
5 యెహోవానుగూర్చి కీర్తన పాడుడి
ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను
భూమియందంతటను ఇది తెలియబడును.
6 సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము
నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు
ఘనుడై యున్నాడు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/12-4336c66523395ed7da1aeb44e3092c69.mp3?version_id=1787—