1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు
వణకును
ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
2 సీయోనులో యెహోవా మహోన్నతుడు
జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.
3 భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు.
యెహోవా పరిశుద్ధుడు.
4 యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు
రాజును స్థిరపరచియున్నావు
యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను
జరిగించియున్నావు.
5 మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి
ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి
ఆయన పరిశుద్ధుడు.
6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి
ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో
సమూయేలు ఉండెను.వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా
ఆయన వారి కుత్తరమిచ్చెను.
7 మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట
లాడెనువారు ఆయన శాసనముల ననుసరించిరి
ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
8 యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివివారిక్రియలనుబట్టి ప్రతికారము చేయుచునే
వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి.
9 మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు
మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి.
ఆయన పరిశుద్ధపర్వతము ఎదుట సాగిలపడుడి.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/99-9e53f76122191d659e827c60eb3566b0.mp3?version_id=1787—