ప్రధానగాయకునికి. షూషనేదూతుమీద పాడదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను అరమోజబాయీయులతోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పుపల్లములో పండ్రెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది. అనుపదగీతము.
1 దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదర
గొట్టి యున్నావు
నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
2 నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని
బద్దలు చేసియున్నావు
అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు
చేయుము.
3 నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి
తూలునట్లుచేయు మద్యమును మాకు త్రాగించితివి
4 సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై
నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము
నిచ్చియున్నావు.(సెలా.)
5 నీ ప్రియులు విమోచింపబడునట్లు
నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము
6 తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి
యున్నాడు
నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను
సుక్కోతు లోయను కొలిపించెదను.
7 గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు
శిరస్త్రాణము
యూదా నా రాజదండము.
8 మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము
ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును
ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.
9 కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొనిపోవును?
ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
10 దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా?
దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని
యున్నావు గదా?
11 మనుష్యుల సహాయము వ్యర్థము
శత్రువులను జయించుటకు మాకు సహాయము దయ
చేయుము.
12 దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము
మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/60-af1e3c2aeb39ee5851877f6f02054331.mp3?version_id=1787—