ప్రధాన గాయకునికి. అష్టమశృతిమీద తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.
1 యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము
నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
2 యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను
కరుణించుము
యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను
బాగుచేయుము
3 నా ప్రాణము బహుగా అదరుచున్నది.
యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4 యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము
నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
5 మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు
పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు?
6 నేను మూలుగుచు అలసియున్నాను
ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.
నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
7 విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి
నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
8 యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు
పాపముచేయువారలారా, మీరందరు నాయొద్దనుండి
తొలగిపోవుడి.
9 యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు
యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
10 నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/6-992303693e859ba8db7dece70201193b.mp3?version_id=1787—