యాత్రకీర్తన.
1 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను
నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
2 యెహోవావలననే నాకు సహాయము కలుగును
ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు
నిన్ను కాపాడువాడుకునుకడు.
4 ఇశ్రాయేలును కాపాడువాడుకునుకడు నిద్రపోడు
5 యెహోవాయే నిన్ను కాపాడువాడు
నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
6 పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు.
రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
7 ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను
కాపాడును
ఆయన నీ ప్రాణమును కాపాడును
8 ఇది మొదలుకొని నిరంతరము
నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/121-55e06826da3adccbb3c72917b1113f60.mp3?version_id=1787—