ప్రధానగాయకునికి. అష్టమశ్రుతిమీద పాడదగినది. దావీదు కీర్తన.
1 యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి
విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.
2 అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు
మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు
పెదవులతో పలుకుదురు.
3 యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని
బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
4 –మా నాలుకలచేత మేము సాధించెదము
మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను
కొందురు.
5 –బాధపడువారికి చేయబడిన బలాత్కారమును
బట్టియు
దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను
రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
6 యెహోవా మాటలు పవిత్రమైనవి
అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి
యంత పవిత్రములు.
7 యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు
ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.
8 నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు
దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/12-ad56172f2fa9fa461984aa96281020b2.mp3?version_id=1787—